News
బీజేపీ సభ్యులకు విప్ జారీ
నాలుగు రోజుల విరామం తర్వాత పార్లమెంటు సమావేశాలు నేడు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో పెద్దనోట్ల రద్దు అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో బీజేపీ సభ్యులకు కేంద్రం విప్ జారీ చేసింది. అగస్టా కుంభకోణంపై కాంగ్రెస్‌ను ఇరుకును పెట్టే వ్యూహంలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. నోట్లరద్దు రగడతో ఈ శీతాకాల సమావేశాలు కొట్టుకుపోతున్నాయి. సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఇదే తంతు. ఇక మూడు రోజులే మిగిలి ఉన్నాయి. చివరి మూడు రోజులైన సభ సజావుగా సాగేందుకు సహకరించాలని అధికార పక్షం కోరుతోంది. అయితే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజుపై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విపక్షాలకు ఆ అంశం హాట్ టాపిక్‌గా మారనుంది. నోట్లరద్దుతో పాటు, రిజిజు వ్యవహారాన్ని విపక్షాలు సభలో లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








